News16th Jul 09:15 AMSunil Byrisetty1 min read
బెంగళూరులో నో యూపీఐ.. ఓన్లీ క్యాష్!
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రెండ్ మారింది. యూపీఐ పేమెంట్స్ వద్దు, నగదు ఇవ్వాలని బోర్డులు పెడుతున్నారు. చిన్నాచితకా వ్యాపారాలు చేసేవాళ్లు కూడా UPI పేమెంట్స్ నిరాకరిస్తున్నారు. తమ
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రెండ్ మారింది. యూపీఐ పేమెంట్స్ వద్దు, నగదు ఇవ్వాలని బోర్డులు పెడుతున్నారు. చిన్నాచితకా వ్యాపారాలు చేసేవాళ్లు కూడా UPI పేమెంట్స్ నిరాకరిస్తున్నారు. తమ దుకాణాలు ముందు నో యూపీఐ అంటూ బోర్డులు పెడుతున్నారు. ఇటీవల బెంగళూరులో రోడ్ల పక్కన బళ్లు, దుకాణాలు నడుపుకునే చిన్నచిన్న వ్యాపారస్థులకు ఇటీవల కర్ణాటక రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ GST నోటీసులు జారీ చేసింది. ఏడాదికి రూ. 20 లక్షలపైన సేవలు, విక్రయాలు జరిపితే, వారు తప్పనిసరిగా GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా యూపీఐ ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షలకుపైగా లావాదేవీలు చేసిన 14,000 మంది వ్యాపారులను బెంగళూరు అధికారులు గుర్తించారు. వీరిలో 5,500 మందికి మొదటి దశలో నోటీసులు జారీ చేశారు.
దీంతో బెంగళూరులో వ్యాపారులు, తమ దుకాణాల నుంచి యూపీఐ QR కోడ్ స్టిక్కర్లు తీసేసి, ఓన్లీ క్యాష్ బోర్డులను పెడుతున్నారు.