National11th Jan 11:41 AMSunil Byrisetty1 min read

వహ్వా బెంగళూరు.. మహిళలు మెచ్చిన నగరం!

2025లో మహిళలకు దేశంలో నచ్చిన, మెచ్చిన బెస్ట్‌ సిటీ ఏదనే సర్వేలో ఎక్కువ మంది ఐటీ నగరానికే ఓటేశారు. గత ఏడాది మహిళలు మెచ్చిన దేశంలోని నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై,

వహ్వా బెంగళూరు.. మహిళలు మెచ్చిన నగరం!
2025లో మహిళలకు దేశంలో నచ్చిన, మెచ్చిన బెస్ట్‌ సిటీ ఏదనే సర్వేలో ఎక్కువ మంది ఐటీ నగరానికే ఓటేశారు. గత ఏడాది మహిళలు మెచ్చిన దేశంలోని నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చెన్నైకి చెందిన అవతార్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో, సామాజిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ఇంక్లూజన్ ద్వారా మహిళలకు మద్దతు, అభివృద్ధికి అనుకూలమైన నగరాలను పరిశీలించారు. దేశంలోని 125 నగరాల్లో జరిగిన ఈ సర్వేలో, 53.29 సిటీ ఇంక్లూజన్ స్కోర్ (సీఐఎస్‌)తో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది.
Bengaluru
Best City for Women 2025
City Inclusion Score
AVTAR Study
Women-Friendly Cities
Urban Infrastructure
ఐటీ నగరం
చెన్నై
హైదరాబాద్
పూణే
ముంబై
భారత నగరాలు
Scroll for the next article