Mobiles23rd Nov 12:06 PMSunil Byrisetty2 min read
బడ్జెట్‌లో బెస్ట్ 5G ఫోన్లు.. క్రేజీ ఫీచర్లు
బడ్జెట్ ధరల్లో 5G స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పవర్ ఫుల్ బ్యాటరీలతో పాటు, అద్భుతమైన ఫీచర్లు, బిగ్ డిస్‌ప్లే, బెస్ట్ కెమెరాను అందించే ఐదు ఉత్తమ 5G ఫోన్‌లు చూద్దాం. మోటరోలా G4
బడ్జెట్ ధరల్లో 5G స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పవర్ ఫుల్ బ్యాటరీలతో పాటు, అద్భుతమైన ఫీచర్లు, బిగ్ డిస్‌ప్లే, బెస్ట్ కెమెరాను అందించే ఐదు ఉత్తమ 5G ఫోన్‌లు చూద్దాం.
మోటరోలా G45 5G
రూ.9,999 ధరలో ఈ మోటరోలా ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇంకా, ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ హ్యాండ్ సెట్ 5000mAh బ్యాటరీ, 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది.
సామ్ సంగ్ గెలాక్సీ M36 5G
దీని ధర రూ.12,499. ఈ హ్యండ్ సెట్ 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ Exynos చిప్‌సెట్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సామ్ సంగ్ నుంచి శక్తివంతమైన 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
వివో Y31 5G
ఈ వివో ఫోన్ ధర రూ. 14,999, 6.68-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 1000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో వస్తోంది.
iQOO Z10x 5G ఫోన్
రూ. 13,998కు అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో మీడియాటెక్ 7300 చిప్‌సెట్, 6,500mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లే కూడా ఉంది. 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
రియల్‌మే పి3ఎక్స్ 5జి
దీని ధర రూ. 11,499. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. మెరుగైన 5G కనెక్టివిటీ, మెరుగైన పనితీరుతో బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్‌గా ఉంది.