News26th Mar 08:30 AMSunil Byrisetty1 min read

ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేక చట్టం

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం యువతను కమ్మేస్తోంది. ఈ భూతానికి ఇటీవల దాదాపు 16 మంది బలయ్యారు. ఇంకా లక్షలాది మంది అదే మాయలో పడి బయటకు రాలేక సతమతమవుతున్నారు. కోట్ల రూపాయలు బెట్టి

ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేక చట్టం
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం యువతను కమ్మేస్తోంది. ఈ భూతానికి ఇటీవల దాదాపు 16 మంది బలయ్యారు. ఇంకా లక్షలాది మంది అదే మాయలో పడి బయటకు రాలేక సతమతమవుతున్నారు. కోట్ల రూపాయలు బెట్టింగుల్లో పెట్టి పోగొట్టుకున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సులువుగా ఆన్లైన్ బెట్టింగులో సంపాదించవచ్చనే ప్రచార భ్రమలో పడి యువత నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. YS వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి' అని సూచించారు. ఆన్లైన్ బెట్టింగుపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Betting
Andhra Pradesh
IPL
చంద్రబాబు
Scroll for the next article