News2nd Sep 04:06 PMSunil Byrisetty1 min read

పింఛన్ల సొమ్ము.. క్రికెట్ బెట్టింగ్ పాలు..

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పంచాల్సిన పింఛను సొమ్మును క్రికెట్ బెట్టింగ్కు ఫణంగా పెట్టాడో పంచాయతీ కార్యదర్శి. పుంగనూరు మండలం బండ్లపల్లె పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు గత నె

పింఛన్ల సొమ్ము.. క్రికెట్ బెట్టింగ్ పాలు..
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పంచాల్సిన పింఛను సొమ్మును క్రికెట్ బెట్టింగ్కు ఫణంగా పెట్టాడో పంచాయతీ కార్యదర్శి. పుంగనూరు మండలం బండ్లపల్లె పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు గత నెల 30న బ్యాంకు నుంచి రూ.6.34 లక్షలు వితై చేశాడు. 31న (ఆదివారం) సెలవు కావడంతో చేతిలోని డబ్బును క్రికెట్ బెట్టింగ్లో పెట్టి రెట్టింపు చేయాలనుకుని పోగొట్టుకున్నాడు. సోమవారం పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఎంత సేపటికీ అధికారులు ఇవ్వకపోవడంతో బాధి తులు సచివాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడి సిబ్బంది స్థానిక ఎంపీడీవో లీలామాధవి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. పంచాయతీ కార్యదర్శిని ఎంపీడీవో పిలిపించి విచారించగా పింఛను సొమ్మును క్రికెట్ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నట్లు నిందితుడు తెలిపాడు. ఎంపీ డీవో సమస్యను డీఆర్డీఏ పీడీ శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీనివా సులు కుటుంబ సభ్యులకు సమస్యను వివరించి నగదు చెల్లించాలని కోరినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బరాయుడు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Andhra Pradesh
Pension Scam
Cricket Betting
Panchayat Secretary
Punganur
Bandlapalle
Elderly Welfare
Disability Pension
Widow Pension
ఆర్థిక దుర్వినియోగం
అవినీతి
పోలీసు కేసు
ఎంపీడీవో
డీఆర్డీఏ
పింఛన్ పంపిణీ లోపం
Scroll for the next article