Crime6th Sep 12:12 PMSunil Byrisetty1 min read
పొరపాటున క్లిక్ చేస్తే.. ఉన్నది పోతుంది..
క్లిక్ చేస్తే డబ్బులు జమ చేస్తామనే మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటిని అద్దెకు ఇస్తామని, పాత వాహనాలను అమ్ముతామని.. ఇలా పలు రకాలుగా వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు వస్తున్నాయి. డిజిటల్ వేది
క్లిక్ చేస్తే డబ్బులు జమ చేస్తామనే మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటిని అద్దెకు ఇస్తామని, పాత వాహనాలను అమ్ముతామని.. ఇలా పలు రకాలుగా వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు వస్తున్నాయి. డిజిటల్ వేదికలైన మ్యాజిక్ బ్రిక్స్, క్వికర్, ఓఎల్‌ఎక్స్, తదితర వాటిల్లో ప్రకటనలను పోస్ట్ చేస్తున్నారు. ప్రకటనలోని నంబరుకు ఫోన్ చేస్తున్నారు. అంతా మాట్లాడుకున్నాక, డబ్బు పంపుతున్నామని నమ్మబలుకుతూ, యజమాని ఖాతా నుంచే సొమ్ము మాయం చేస్తున్నారు.నిజమే అని నమ్మి, ఫోన్‌కు వచ్చిన రిక్వెస్ట్‌పై క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఇటీవల ఒక ఉద్యోగి వాహనం తీసుకునేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలోని నంబరుకు ఫోన్ చేసి బేరం మాట్లాడుకున్నాడు. డబ్బు పంపించాల్సిన వ్యక్తి క్యూఆర్ పేరుతో రిక్వెస్ట్ పంపాడు. అవతలి వ్యక్తి క్లిక్ చేయగానే అంత మేర నగదు మాయమైపోయింది. అందుకే ఇలాంటి డిజిటల్ కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.