News22nd Mar 11:47 AMSunil Byrisetty1 min read

భద్రాద్రి రామయ్య కల్యాణానికి చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు

కల్యాణంలో అతి పవిత్రంగా భావించే వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రా

భద్రాద్రి రామయ్య కల్యాణానికి చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు
కల్యాణంలో అతి పవిత్రంగా భావించే వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతామూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాములవారి కల్యాణానికి గడచిన 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతులవుతున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. నిర్వాహకులు పొత్తూరి బాలకేశవులు మాట్లాడుతూ కల్యాణం మహోత్సవానికి అన్ని తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందని అన్నారు.
Bhadrachalam
Seetharamula Kalyanam
శ్రీరామనవమి
తలంబ్రాల
Scroll for the next article