Spiritual12th Sep 09:42 AMSunil Byrisetty1 min read
నేటినుండి భాద్రపద మాసం..
భాద్రపదం అనగానే మనకు గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినం!... అయితే దేవతా పూజలతోపాటు -- పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ‘భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవది.. ఈ
భాద్రపదం అనగానే మనకు గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినం!... అయితే దేవతా పూజలతోపాటు -- పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ‘భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవది.. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం. భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు, ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినం మనకు ‘వినాయక చవితి’ పర్వదినం. భాద్రపద మాసం అనేది కేవలం పండుగలు, ఆచారాల పరంగానే కాకుండా ఖగోళ, వాతావరణ మరియు ఆయుర్వేద కోణాల్లో కూడా స్పష్టమైన శాస్త్రీయ ప్రాతిపదిక కలిగిన కాలం.