National28th Nov 04:59 PMSunil Byrisetty1 min read

ప్రధాని సమక్షంలో లక్ష కంఠాలతో భగవద్గీత

కర్ణాటకలోని ఉడిపిలో ప్రధాని మోదీ పర్యటించారు. ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి, 'లక్ష కంఠ భగవద్గీత పఠనం' కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ మఠానికి చేరుకున్న మోదీకి, జగద్గుర

ప్రధాని సమక్షంలో లక్ష కంఠాలతో భగవద్గీత
కర్ణాటకలోని ఉడిపిలో ప్రధాని మోదీ పర్యటించారు. ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి, 'లక్ష కంఠ భగవద్గీత పఠనం' కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ మఠానికి చేరుకున్న మోదీకి, జగద్గురు శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వాగతం పలికి సత్కరించారు. విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాల పౌరులతో కలిసి లక్ష మంది ఏకకాలంలో భగవద్గీతను పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని కూడా పాలుపంచుకున్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉడిపి తనకు చాలా ప్రత్యేకమైన ప్రదేశమని, జనసంఘ్, భారతీయ జనతా పార్టీల సుపరిపాలన నమూనాకు ఉడిపి ఒక కర్మభూమి అని అభివర్ణించారు. 1968లోనే ఇక్కడి ప్రజలు జనసంఘ్ తరఫున వీఎస్ ఆచార్యను మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నుకొని సుపరిపాలనకు పునాది వేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Indian Culture
Spiritual Event
BJP History
PM Modi
Udupi Visit
Laksha Kantha Gita Parayana
Bhagavad Gita Recitation
Sri Krishna Matha
Karnataka News
Sugunendra Teertha Swamiji
Scroll for the next article