News3rd Jun 04:31 PMSunil Byrisetty1 min read

మచిలీపట్నంలో 2కె రన్

మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి 2కె రన్ నిర్వహిస్తున్నారు. భైరవం సినీ నటులు మంచు మనోజ్, నారా రోహిత్ జెండా ఊపి 2కె రన్ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక

మచిలీపట్నంలో 2కె రన్
మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి 2కె రన్ నిర్వహిస్తున్నారు. భైరవం సినీ నటులు మంచు మనోజ్, నారా రోహిత్ జెండా ఊపి 2కె రన్ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటకాన్ని విస్తరించే లక్ష్యంతో మసుల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ రన్ నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పర్యాటకంగా బందరును అభివృద్ధి చేస్తామని చెప్పారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరును మారుస్తామన్నారు. 5, 6, 7, 8 తేదీల్లో అంగరంగ వైభవంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నేషనల్ క్రీడలతో జాతీయ స్థాయి గుర్తింపు తెస్తామన్నారు. ప్రపంచానికి బందరు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Andhra Pradesh news
Bhairavam movie
Kollu Ravindra
2k Run
Masula Beach Festival
Bhairava movie Unit
మచిలీపట్నంలో 2కె రన్
చిత్ర హీరో మంచు మనోజ్
నారా రోహిత్
Scroll for the next article