News10th Jun 03:33 PMSunil Byrisetty1 min read
మహిళలకు భారతి క్షమాపణ చెప్పాలి
సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి ప్రాంత మహిళలపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్, కృష్ణంరాజులను అరెస్ట్ చ
సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి ప్రాంత మహిళలపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్, కృష్ణంరాజులను అరెస్ట్ చేయాలని, ఛానల్ అధినేత భారతి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు్న్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సత్యవేడు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి, బిజెపి, జనసేన మహిళా కార్యకర్తలతో ర్యాలీ చేశారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ ఛానల్ డౌన్ డౌన్ అని, రెండిటినీ వెంటనే మూసివేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. జర్నలిస్టుల ముసుగులో మహిళలపై దుర్భాషలాడిన కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.