Spiritual11th Dec 11:40 AMSunil Byrisetty1 min read

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేడు ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 6.30 గంటలకు హోమగుండాల అగ్ని ప్రతిష్టాపన జరిగింది. ఉదయం

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేడు ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 6.30 గంటలకు హోమగుండాల అగ్ని ప్రతిష్టాపన జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన నిర్వహించి.. ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు. భవానీ దీక్షల సమయంలో అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అన్ని ఆర్జిత సేవలు, టికెట్ దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. ఐదు క్యూలైన్లలో భవానీ దీక్షదారులకు ఉచిత దర్శనానికి అనుమతినిచ్చింది. భక్తుల భద్రత పర్యవేక్షణకు 320 సీసీ కెమెరాలతో నిఘాతోపాటు.. కొండ దిగువన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీగా భక్తుల రాక దృష్ట్యా 28 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
Andhra Pradesh
Bhavani Deeksha
Indrakeeladri
Vijayawada Kanaka Durga Temple
Deeksha Conclusion
Darshan Timings
Arjitha Seva Cancelled
ఆర్జిత సేవలు రద్దు
ఉచిత దర్శనం
భక్తుల భద్రత
కమాండ్ కంట్రోల్ రూమ్
వైద్య శిబిరాలు
Scroll for the next article