Spiritual18th Nov 04:48 PMSunil Byrisetty1 min read
11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణ
భవానీ దీక్షలను స్వీకరించి 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలా దర్శనభాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన
భవానీ దీక్షలను స్వీకరించి 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలా దర్శనభాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్షా విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు.
డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించన్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఆలయ ఈవో వి.కె. శీనానాయక్ లతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణకు గత ఏడాది 3.20 లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలిరావడం జరిగిందని.. ఈ ఏడాది ఆరు లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. రోజుకు దాదాపు లక్ష వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. చివరి రెండు రోజుల్లో దాదాపు లక్షా 50 వేల మంది భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో అంచనాలకు మించి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చినప్పటికి అధికారులు సమన్వయంతో చేసిన ఏర్పాట్లు కారణంగా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో భవానీ దీక్షల విరమణను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్‌కు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు.