News6th Dec 03:39 PMSunil Byrisetty1 min read
విజయవాడ అప్‌డేట్స్, ప్రజా సమావేశం, బాధితుల సమస్యలు
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురం 42 ప్లాట్ల బాధితులు కలిశారు. తాము నష్ట పోయిన వైనాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి న్యాయ నిపుణులతో బాధితులను మాట్ల
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురం 42 ప్లాట్ల బాధితులు కలిశారు. తాము నష్ట పోయిన వైనాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి న్యాయ నిపుణులతో బాధితులను మాట్లాడించారు. భవిష్యత్ కార్యాచరణపై న్యాయవాదుల బృందం చర్చించింది. అలాగే ప్లాట్ల వ్యవహారంపై కొందరు అధికారులతోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ, సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.