News10th Jan 11:53 AMSunil Byrisetty1 min read
భీమవరంలో సంక్రాంతి రికార్డ్.. గది అద్దె రూ. లక్ష!
సంక్రాంతి సంబరాలను సొమ్ము చేసుకునేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేల డిమాండ్ దృష్ట్యా గది అద్దెలను భారీగా పెంచేశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల
సంక్రాంతి సంబరాలను సొమ్ము చేసుకునేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేల డిమాండ్ దృష్ట్యా గది అద్దెలను భారీగా పెంచేశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తుండటంతో వసతి గదులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు వంటి పట్టణాల్లోని దాదాపు 150 హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీ లేదు. రోజుకు రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు ఉండే గది ధర, ఇప్పుడు మూడు రోజుల ప్యాకేజీ కింద రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు పలుకుతోంది. భీమవరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో మూడు రోజులకు గాను ఒక్కో గదికి రూ. లక్ష చొప్పున వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పందెం పెట్టుబడి కన్నా గది కోసం పెట్టాల్సింది ఎక్కువైపోతోందని చర్చలు మొదలయ్యాయి.