News30th Jul 11:07 AMSunil Byrisetty1 min read

భోగాపురంలో ‘ఎయిర్ పోర్ట్ రన్’

భోగాపురంలోని 'అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయం రన్' పోస్టర్‌ను క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. యువతలో ఫిట్‌నెస్, క్రీడాస్ఫూర్తి పెంపొందించడ

భోగాపురంలో ‘ఎయిర్ పోర్ట్ రన్’
భోగాపురంలోని 'అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయం రన్' పోస్టర్‌ను క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. యువతలో ఫిట్‌నెస్, క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే ప్రధాన ఉద్దేశంగా, జూలై 31న 5K 'ASR భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యువత, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రన్ ఏర్పాట్లను మంత్రి మండిపల్లికి జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ గాలోట్ వివరించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ, రీజినల్ మేనేజర్ పాల్గొన్నారు. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Andhra Pradesh
Bhogapuram Airport
Alluri Sitarama Raju International Airport
Mandipalli Ramprasad Reddy
5కే రన్
ఎయిర్‌పోర్ట్ రన్
ఫిట్‌నెస్
క్రీడలు
యువత
నరేంద్ర మోదీ
క్రీడాశాఖ
Scroll for the next article