News5th Jan 04:43 PMSunil Byrisetty1 min read
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సీఎం చిత్తశుద్ధికి ప్రతీక
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, పట్టుదల, చిత్తశుద్ధకి ప్రతీకగా ఆవిర్భవించిన మహత్తర ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని రాష్ట్ర మంత్రులు బి.సి.జనార్థన రెడ్డి, కింజరాపు అ
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, పట్టుదల, చిత్తశుద్ధకి ప్రతీకగా ఆవిర్భవించిన మహత్తర ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని రాష్ట్ర మంత్రులు బి.సి.జనార్థన రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం దిశగా తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాలలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒకటన్నారు. ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ సీఎం చంద్రబాబు నాయుడే అని వారు పునరుద్ఝాటించారు. సోమవారం సచివాలయంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి పారిశ్రామిక, ఆర్థిక, పర్యాటక రంగాలలో విస్తృత అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో 2014లో చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఆలోచించి ప్రారంభించారన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలకు సమాన దూరంలో ఉండే భోగాపురం ప్రాంతాన్ని ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మించాలనే దూరదృష్టితో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.