News31st Jul 03:27 PMSunil Byrisetty1 min read

ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్‌ ఛేంజర్‌

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు, ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం వద్ద మా

ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్‌ ఛేంజర్‌
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు, ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం వద్ద మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సంక్షేమం,ఆర్థికాభివృద్ధి, ఉపాధి, రవాణా,పర్యాటకం, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడే అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మూడు లక్షలకు పైగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రజల రాకపోకలకు ఇప్పటికే సుమారు 5–6 వేల బస్సులను ఏర్పాటు చేశామని, ప్రజా ప్రతినిధులు కూడా తమ సొంత వాహనాలతో పాటు మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
Andhra Pradesh
Bhogapuram International Airport
Alluri Sitarama Raju International Airport
North Andhra
Kolusu Parthasarathy
మౌలిక సదుపాయాలు
పర్యాటకం
ఉపాధి
ఆర్థికాభివృద్ధి
రవాణా
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article