News24th Jun 04:04 PMSunil Byrisetty1 min read
సుభాష్.. మీ సేవలు భేష్ అన్న కేంద్ర మంత్రి
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అమరావతిలో జరిగిన సమావేశంలో ఇందుకు
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అమరావతిలో జరిగిన సమావేశంలో ఇందుకు వేదిక అయింది. సుభాష్ ఎలా ఉన్నారు.. అంటూ ఆప్యాయంగా తొలుత క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. ఇటు ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను.. చాలా ఆనందం అనిపించింది. మీ సేవా నిరతిని ఎప్పటిలాగే కొనసాగించండి. ప్రజల్లో మీ సేవా కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.. శభాష్ అంటే భుజం తట్టి ప్రశంసించారు. అనంతరం శాఖపరమైన కొన్ని అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి సుభాష్ తీసుకెళ్లారు. కేంద్రమంత్రి స్పందిస్తూ త్వరలోనే మరోసారి కలిసి అభివృద్ధిపై చర్చించుకుందాం అని అన్నారు.