Sports20th Nov 03:54 PMSunil Byrisetty1 min read

టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో మంగళగిరికి చెందిన భువన్ ప్రతిభ

విశాఖపట్టణంలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 17వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ 2025 పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మంగళగిరికి చెందిన దేవతి రంజిత

టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో మంగళగిరికి చెందిన భువన్ ప్రతిభ
విశాఖపట్టణంలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 17వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ 2025 పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మంగళగిరికి చెందిన దేవతి రంజిత్ కుమార్, శ్రీ లక్ష్మీ జ్యోష్ణ దంపతుల ద్వితీయ కుమారుడు దేవతి భువన్ పాల్గొని, మొదటి బహుమతి సాధించి ప్రతిభ కనబరిచాడు. 11 సంవత్సరాలు వయసు కలిగిన దేవతి భువన్ విజయవాడ సిద్ధార్థ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతూ, ఫన్ టైం క్లబ్ నందు టేబుల్ టెన్నిస్ లో శిక్షణ పొందుతున్నాడు. ఇప్పటికే మహారాష్ట్ర, పూణే, ఢిల్లీ లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలలో సత్తా చాటి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా విశాఖలో జరిగిన ఛాంపియన్షిప్ లో ప్రథమ స్థానంలో నిలిచి అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టేబుల్ టెన్నిస్ విజేత ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవతీ భగవన్నారాయణ మనుమడు కావడం విశేషం.
Andhra Pradesh
Table Tennis Championship 2025
Mangalagiri
Devathi Bhuvan
Andhra Pradesh Sports
Visakhapatnam
GITAM University
Junior Table Tennis
ఫన్ టైం క్లబ్
విజయవాడ సిద్ధార్థ పాఠశాల
ఆర్యవైశ్య మహాసభ
Scroll for the next article