News21st Oct 08:38 AMSunil Byrisetty1 min read
చిగురు చిల్డ్రన్స్ హోమ్‌లో భువనేశ్వరి దీపావళి!
ఉండవల్లి గ్రామంలోని 'చిగురు చిల్డ్రన్స్ హోమ్' ఆ రోజు మామూలు రోజులా లేదు. పండుగ వెలుగుతో పాటు, ఓ పెద్దమ్మ ఆప్యాయత కూడా ఆ ఇంటిలో చిగురించింది. ఆమే నారా భువనేశ్వరి. దీపావళి అంటే ఇంటిల
ఉండవల్లి గ్రామంలోని 'చిగురు చిల్డ్రన్స్ హోమ్' ఆ రోజు మామూలు రోజులా లేదు. పండుగ వెలుగుతో పాటు, ఓ పెద్దమ్మ ఆప్యాయత కూడా ఆ ఇంటిలో చిగురించింది. ఆమే నారా భువనేశ్వరి. దీపావళి అంటే ఇంటిల్లిపాది సంతోషంగా గడిపే వేళ. కానీ, తల్లిదండ్రుల అండలేని ఆ 90 మంది చిన్నారులకు, ఆ హోమ్ పరిధులే ప్రపంచం.
అలాంటి పిల్లల మధ్యకు భువనేశ్వరి రావడం, కేవలం ఒక సందర్శన కాదు. అది అనురాగం పంచుకోవడానికి వచ్చిన ఒక 'అమ్మ' పలకరింపులా ఉంది. వారి మొహాల్లోని చిరునవ్వులు చూడటానికి, వారి జీవితాల్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించడానికి ఆమె అడుగుపెట్టారు. టపాసులు, స్వీట్లు ఆమె స్వయంగా తమ చేతులతో పంచుతుంటే, ఆ పిల్లల కళ్ళల్లో మెరుపు. వారి సంతోషంలో పాలుపంచుకుంటూ, ఆమె కూడా వారితో కలిసి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చారు. పిల్లలందరికీ స్వయంగా భోజనం వడ్డించారు. సుమారు గంటసేపు వారి మధ్య గడిపి. పిల్లలతో ముచ్చటించారు.