News20th Nov 01:39 PMSunil Byrisetty1 min read

కుప్పంలో భువనేశ్వరి ప్రజా దర్బార్!

చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు శాంతిపురం నివాసంలో నారా భువనేశ్వరి ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చే

కుప్పంలో భువనేశ్వరి ప్రజా దర్బార్!
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు శాంతిపురం నివాసంలో నారా భువనేశ్వరి ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరిని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు. కుప్పం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను పంపిణీ చేశారు.
Andhra Pradesh
Bhuvaneshwari
Kuppam Tour
Praja Darbar
Public Grievances
Chittoor District
Nara Bhuvaneshwari
Local Leaders
DPS Students
Swachh Bharat Awards
స్వచ్ఛ భారత్ అవార్డులు
దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్
వినికిడి పరికరాల పంపిణీ
Scroll for the next article