Education28th Jul 03:34 PMSunil Byrisetty1 min read

విద్యార్థులతో క్విజ్ నిర్వహించిన భువనేశ్వరి

కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విద్యార్థులతో క్విజ్ నిర్వహించారు. ఎంతోమంది విద్యార్థులను కలుస్తూ వారి లక్ష్య సాధనకు నా వంతుగా ప్రేరణ కలిగిస్తున్నందుకు

విద్యార్థులతో క్విజ్ నిర్వహించిన భువనేశ్వరి
కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విద్యార్థులతో క్విజ్ నిర్వహించారు. ఎంతోమంది విద్యార్థులను కలుస్తూ వారి లక్ష్య సాధనకు నా వంతుగా ప్రేరణ కలిగిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. లక్ష్యంతో ముందుకెళ్తే టీచర్, ఇంజనీర్, డాక్టర్, బిజినెస్ మ్యాన్, పోలీస్, ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా సాధించవచ్చని తెలిపారు. దేశ రక్షణలో పోలీసుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఒక్కరోజులో ఏ విజయమూ రాదు. నిరంతర కృషితోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్పారు. గురువులు మార్గదర్శకులని, వారిని గౌరవించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అత్యుత్తమ విద్య అందిస్తున్నాయన్నారు. విద్యార్థుల చదువుకు చేయూత అందించేందుకు మన ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తోందని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రైవేటు నుంచి 1.06 లక్షలమంది విద్యార్థులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని భువనేశ్వరి పేర్కొన్నారు.
Andhra Pradesh
Nara Bhuvaneswari
N Chandrababu Naidu
Nara Lokesh
Kuppam
Student Quiz
Education
Government Schools
తల్లికి వందనం
విద్యాశాఖ
ప్రేరణ
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article