Crime1st Mar 10:09 AMSunil Byrisetty1 min read

సజ్జల స్క్రిప్ట్ చదివా: పోసాని సంచలనం

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అనంతరం కోర్టులో హాజరుపరిచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. పోసాని రిమాండ్ రిపోర్టులో ప

సజ్జల స్క్రిప్ట్ చదివా: పోసాని  సంచలనం
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అనంతరం కోర్టులో హాజరుపరిచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. పోసాని రిమాండ్ రిపోర్టులో పవన్ కల్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించానని, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పినట్లుగా సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు తాను విమర్శలు చేశానని, జనసేనాని అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను మాట్లాడిన అంశాలకు సంబంధించిన వీడియోలను సజ్జల తనయుడు భార్గవరెడ్డి సామాజిక మాధ్యమంలో వైరల్ చేసేవాడని చెప్పారని తెలుస్తోంది.
posani krishna murali
sajjala ramakrishna reddy
posani remand posaniarrest పోసాని కృష్ణ మురళి
సజ్జల రామకృష్ణ రెడ్డి
పోసానిరిమండ్
పోసానిఅరెస్ట్
Scroll for the next article