Politics2nd Dec 01:34 PMSunil Byrisetty1 min read

రామచంద్రపురం నియోజవర్గంలో వైసిపికి బిగ్ షాక్

రామచంద్రపురం నియోజవర్గంలో వైసీపీకి పెద్ద షాకే తగిలింది. సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన, రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న సంస్కరణలు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గానికి

రామచంద్రపురం నియోజవర్గంలో వైసిపికి బిగ్ షాక్
రామచంద్రపురం నియోజవర్గంలో వైసీపీకి పెద్ద షాకే తగిలింది. సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన, రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న సంస్కరణలు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు వ్యక్తిగతంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న విధానానికి ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం కె గంగవరం గ్రామ సర్పంచ్ కోటి లక్ష్మీనరసమ్మ వెంకట్రావు, రామచంద్రపురం రూరల్ అన్నయ్య పేట గ్రామం నుంచి వైసీపీలో గత 15 సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్న యువ నాయకుడు బొమ్మోత్తుల అబ్బాయి నాయుడుతో పాటు మరో 25 మంది ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత రాయ్ సారధ్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారందరినీ మంత్రి సుభాష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యo లు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నాయకులందరినీ కలుపుకొని, టిడిపి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.
Andhra Pradesh Politics
Ramachandrapuram
TDP
YSRCP
Political Shift
Subhash Vasamshetti
Telugu Desam Party
రాజకీయాలు
ప్రాంతీయ అభివృద్ధి
పార్టీ మార్పు
Scroll for the next article