Politics24th Apr 12:19 PMSunil Byrisetty1 min read
విడదల రజనికి షాక్.. మరిది గోపీ అరెస్టు
మాజీమంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవ
మాజీమంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు.
అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు.
వైసీపీ పాలనలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషన్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీమంత్రి విడుదల రజనితోపాటు ఆమె మరిది గోపిపైనా కేసు నమోదైంది.
వీరికి సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువా సహా మాజీ మంత్రి రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు చేసింది.
ఈ కేసులో సహ నిందితురాలిగా ఉన్న విడదల రజనీ విదేశాలకు వెళ్లకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు.