Politics13th Apr 11:06 AMSunil Byrisetty1 min read
రాహుల్, సోనియా గాంధీలకు షాక్!
కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, సోనియా గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీల ఆస్తులు స్వాధీనం చేసుకుంటోంది. ఏప్రిల్ 11న ఢి
కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, సోనియా గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీల ఆస్తులు స్వాధీనం చేసుకుంటోంది.
ఏప్రిల్ 11న ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అసోసియేట్ జర్నల్ లిమిటెడ్‌కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్, సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేశారు.
AJL రూ.2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది.
కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పై జరిగిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తుల స్వాధీనం కోసం ఈడీ నోటీసులు జారీ చేసింది.