Politics21st Mar 11:49 AMSunil Byrisetty1 min read
విశాఖలో వైసీపీకి షాక్!
వైసీపీకి వరుస షాకులు తప్పట్లేదు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్లో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అమరావతిలో టీడీప
వైసీపీకి వరుస షాకులు తప్పట్లేదు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్లో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
వైసీపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అమరావతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు..
ఆరుగురు కార్పొరేటర్లకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కె.సునీత (13వ డివిజన్), గేదెల లావణ్య (17వ డివిజన్), ఎం. మేరీ జాన్సీ(36వ డివిజన్), చల్లా రజనీ (54వ డివిజన్), ముర్రి వాణి నానాజీ (57వ డివిజన్), భూపతిరాజు సుజాత (73వ డివిజన్) తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు.
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్ లీడర్ పైలా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.