Politics23rd Apr 04:42 PMSunil Byrisetty1 min read
వైసీపీకి బిగ్ షాక్.. చేజారిన మరో మున్సిపాలిటీ!
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నీసాతో పాటు వైస్ ఛైర్మన్లు గంగాదేవి, రాజశేఖర్ రెడ్డిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ తగిలింది.
మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నీసాతో పాటు వైస్ ఛైర్మన్లు గంగాదేవి, రాజశేఖర్ రెడ్డిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గింది.
ఈ పరిణామంతో కదిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఖాతాలోకి చేరింది.
కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.
హాజరైన సభ్యులందరూ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు.
కాగా, అధికార వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఓటు అవసరం లేకుండానే కోరం ఉండటంతో తీర్మానం ఆమోదం పొందింది.
దీంతో వైసీపీ ఖాతా నుంచి మరో మున్సిపాలిటీ చేజారినట్లయింది.