Politics11th Jul 09:38 AMSunil Byrisetty1 min read
ఆ వైసీపీ నేతల అరెస్ట్ ఖాయమా?
గత వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన నేతలపై అరెస్ట్ కత్తి వేలాడుతోంది. వారంతా అరెస్టై వైసీపీకి త్వరలో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో
గత వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన నేతలపై అరెస్ట్ కత్తి వేలాడుతోంది. వారంతా అరెస్టై వైసీపీకి త్వరలో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో వైపు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ లిస్ట్‌లో ఉన్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే వల్లభనేని వంశీ, కాకాణి, చెవిరెడ్డి పలు కీలక కేసుల్లో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ విభాగాలు వారి అక్రమాలను బయటకు తీస్తున్నట్లు సమాచారం.