Politics20th Sep 09:03 AMSunil Byrisetty1 min read
వైసీపీకి బిగ్ షాక్!
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకున్నా శాసనమండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మండలిలో వైసీపీ బ
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకున్నా శాసనమండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మండలిలో వైసీపీ బలం ఎక్కువ ఉండటమే కారణం. అయితే మండలిలో వైసీపీకి షాకిచ్చేలా ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు.
చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ చేరారు. వారికి టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.