Crime12th Mar 02:53 PMSunil Byrisetty1 min read
హైకోర్టుకు పోసాని.. బిగ్ ట్వి్స్ట్
జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ నెలకొంది. పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దీంతో పీటీ వారెంట్ ను పోసాని హైకోర్టులో సవాల్ చ
జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ నెలకొంది.
పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు.
దీంతో పీటీ వారెంట్ ను పోసాని హైకోర్టులో సవాల్ చేశారు.
పోసాని తరపున వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ చేపట్టనుంది.
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
అన్ని కేసుల్లో ఆయనకు కోర్టులు రిమాండ్ విధించగా.. అన్ని కేసుల్లో బెయిల్ కూడా మంజూరయింది.
జైలు నుంచి పోసాని విడుదలవుతారని భావిస్తున్న తరుణంలో పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదల ఆగిపోయింది.
ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.