Politics21st Sep 11:25 AMSunil Byrisetty1 min read

అక్టోబర్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్!

అక్టోబర్ మొదటి వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప

అక్టోబర్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్!
అక్టోబర్ మొదటి వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి కావస్తోంది. ఈ నెల 30 నాటికి తుది ఓటర్ల జాబితాల ప్రకటన విడుదల చేయనున్నారు. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణాలోని జూబ్లీహిల్స్ సహా దేశంలో పలు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా వున్న అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు కూడా షెడ్యూల్ అక్టోబర్ మొదటివారంలోనే వెలువడనుంది.
Indian Politics
Bihar Elections 2025
Election Commission
Assembly Polls
Voter List
Bihar Politics
By-Elections
Telangana Jubilee Hills
October Elections
Election Schedule
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
ప్రజాస్వామ్యం
ఓటింగ్
Scroll for the next article