Politics9th Nov 12:47 PMSunil Byrisetty1 min read
బీహార్ యువత ఎన్ డీఏను గెలిపించాలి
బీహార్ సర్వతోముఖాభివృద్ధికి మరోమారు యువత ఎన్డీఏను గెలిపించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్...
బీహార్ సర్వతోముఖాభివృద్ధికి మరోమారు యువత ఎన్డీఏను గెలిపించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్... అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... "నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు. బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనది. బీహార్ యువత మరోమారు ఎన్ డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్ డీఏని గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్ లో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. అదే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం వల్ల భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. అంతేగాక కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్ డీఏ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. కాబట్టి ఎన్డీయేను గెలిపించి, బీహార్లో డబుల్ ఇంజిన్ సర్కారును తెచ్చుకోవాల"ని లోకేష్ పిలుపునిచ్చారు.