News22nd Aug 04:03 PMSunil Byrisetty1 min read

ఇదేం తీరు.. రాజకీయ పార్టీలపై సుప్రీం ఆశ్చర్యం!

బిహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చి బెంచ్ ఈ అంశంపై విచారణ చేపట్టింది. డిలీట్ చేసిన ఓటర్ పేర్ల

ఇదేం తీరు.. రాజకీయ పార్టీలపై సుప్రీం ఆశ్చర్యం!
బిహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చి బెంచ్ ఈ అంశంపై విచారణ చేపట్టింది. డిలీట్ చేసిన ఓటర్ పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు చొరవతో ముందుకు రావాలని కోరింది. అదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ ఫ్రెండ్లీగా ఉండాలని పునరుద్ఘాటించింది. “డిలీట్ చేసిన పేర్ల విషయంలో ఆధార్ కార్డు లేదా.. ఏదైనా ఆమోదయోగ్య పత్రంతో పాటు చేసే ఆన్లైన్ సబ్మిషన్లను అనుమతిస్తాం” అని న్యాయస్థానం పేర్కొంది. పేర్ల తొలగింపులపై భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందన వస్తే దరఖాస్తు సమర్పణల తుది గడువును ఎందుకు పొడిగించకూడదని జస్టిస్ కాంత్ ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రశ్నించారు. మరోవైపు ఈ ప్రక్రియలో బిహార్ రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములై తమ బూత్ స్థాయి ఏజెంట్లతో ఓటర్లకు సాయం చేయాలని కోర్టు పేర్కొంది.
India
Supreme Court
Bihar SIR
Voter List Deletion
Election Commission
Justice Surya Kant
Justice Joymalya Bagchi
Aadhaar
Online Submission
Booth Level Agents
Electoral Reforms
భారత న్యాయవ్యవస్థ
ఎన్నికల సంస్కరణలు
Scroll for the next article