News4th Nov 05:37 PMSunil Byrisetty1 min read
రైలుపైకి ఎక్కిన రైలు.. ఛత్తీస్ గఢ్‌లో ప్రమాదం
రైలుపైకి రైలు ఎక్కిన ఘోర ప్రమాదం ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం బిలాస్‌పూర్‌లోని జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో
రైలుపైకి రైలు ఎక్కిన ఘోర ప్రమాదం ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం బిలాస్‌పూర్‌లోని జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో 25 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.