News11th Dec 04:21 PMSunil Byrisetty1 min read
అమరావతి కోసం పార్లమెంటులో బిల్లు
అమరావతికి రాజధాని హోదా కల్పించేలా బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ, లేదా వచ్చే సమావేశాల్లో గానీ అమరావతిని
అమరావతికి రాజధాని హోదా కల్పించేలా బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ, లేదా వచ్చే సమావేశాల్లో గానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. రాజధానిని 2014 నుంచి గుర్తించాలా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల వల్లే బిల్లు ఆలస్యమవుతోందని పెమ్మసాని వివరించారు. అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే వేలాది మంది నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారని పెమ్మసాని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ బ్యాంకులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. త్వరలో హడ్కో, కాగ్, పోస్టల్ భవనం, కేంద్రీయ విద్యాలయాలు వంటివి అమరావతిలో ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత గుర్తింపు రానుందని తెలిపారు.