TTD26th Nov 04:34 PMSunil Byrisetty1 min read

టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళమిచ్చిన బిలియనీర్

బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. ఇటీవల ఉదయ్ పూర్లో ఆయన అట్టహాసంగా తన కుమార్తె వివాహం జరిపించారు. అనంతరం తిరుమల విచ్చేసి, PAC 1,2,3 భవనాల ఆధుని

టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళమిచ్చిన బిలియనీర్
బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. ఇటీవల ఉదయ్ పూర్లో ఆయన అట్టహాసంగా తన కుమార్తె వివాహం జరిపించారు. అనంతరం తిరుమల విచ్చేసి, PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9 కోట్లు విరాళం అందజేశారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
TTD
Donation
Billionaire Mantenna Ramalinga Raju
Tirumala
Temple Contribution
PAC భవనాల ఆధునికీకరణ
నేత్ర
వంశీ
దాతృత్వం
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article