News6th Nov 05:15 PMSunil Byrisetty1 min read
ఎర్ర చందనం రైతులకు ప్రోత్సాహం
రాష్ట్రంలోని ఎర్ర చందనం పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ జీవవైవిధ్య అథారిటీ (ఎన్‌బిఎ) రూ.3 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం రాష్ట్రంలో 198 మంది రైతులు, ఆంధ్రా యూనివర్సిట
రాష్ట్రంలోని ఎర్ర చందనం పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ జీవవైవిధ్య అథారిటీ (ఎన్‌బిఎ) రూ.3 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం రాష్ట్రంలో 198 మంది రైతులు, ఆంధ్రా యూనివర్సిటీకి విడుదల చేసింది. ఈ మేరకు పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. సమ్మిళిత జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించడానికి ఎన్‌బిఎ చేపట్టిన ప్రయోజనాలను పంచుకునే చర్యల శ్రేణిపై ఆధారపడి ఉంటుంది. సాగు చేసిన ఎర్ర చందనం కలప పరిమాణాన్ని బట్టి ఒక్కో రైతుకు రూ.33 వేలు నుంచి రూ.22 లక్షల వరకు మొత్తాన్ని అందుకుంటారు. కలప అమ్మకపు విలువ కంటే లబ్ధిదారులు ఎక్కువ మొత్తాలను అందుకుంటున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు (చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప) జిల్లాల్లోని 48 గ్రామాలకు చెందినవారు. ఆ జిల్లాల్లోని పలు గ్రామాల రైతులకు ఈ ప్రోత్సాహం అందుతుంది. గతంలో రెడ్ సాండర్స్ రక్షణ, పరిరక్షణ కోసం రాష్ట్ర అటవీశాఖ, కర్ణాటక అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డుకు రూ.48 కోట్లు, తమిళనాడులోని రైతులకు రూ.55 లక్షలు ఎన్‌బిఎ విడుదల చేసింది.