News6th Jan 12:01 PMSunil Byrisetty1 min read
గ్రామీణ ప్రాంతాలకు బయోమైనింగ్ విస్తరణ
పేరుకుపోయిన చెత్త తొలగింపునకు గ్రామీణ ప్రాంతాలకు కూడా బయోమైనింగ్ విస్తరణ జరుగుతుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూ
పేరుకుపోయిన చెత్త తొలగింపునకు గ్రామీణ ప్రాంతాలకు కూడా బయోమైనింగ్ విస్తరణ జరుగుతుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జరిగిన స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ గ్రామ పంచాయతీ సభలో ఆయన ప్రసంగించారు. ఆధునిక యంత్రాల ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, మార్పు తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సంకల్పమని చెప్పారు. దానికి అనుగుణంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ పని చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తని ఆధునిక యంత్రాల(లిట్టర్ పిక్కర్స్) సహాయంతో తొలగించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటువంటి యంత్రాలను కనీసం మండలానికి ఒకటి అందించాలన్న ఉద్దేశం ఉందన్నారు. తొలుత ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి ఒక యంత్రం అందించే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తర్వాత 175 నియోజకవర్గాలకు అందజేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిపారు. మునిసిపాలిటీలలో ఏర్పాటు చేసే చెత్త ప్రాసెసింగ్ సెంటర్ల పరిధిలో గ్రామాలను చేర్చి, గ్రామాలలోని చెత్తని ఏరోజుకారోజు తొలగించే ఏర్పాటు చేస్తామన్నారు.