News6th Apr 11:12 AMSunil Byrisetty1 min read

బర్డ్ ఫ్లూపై భయమొద్దు.. కలెక్టర్ భరోసా

పల్నాడు జిల్లాలో నమోదైన బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని గురువారం కలెక్టర్ అరుణ్ బాబు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని,

బర్డ్ ఫ్లూపై భయమొద్దు.. కలెక్టర్ భరోసా
పల్నాడు జిల్లాలో నమోదైన బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని గురువారం కలెక్టర్ అరుణ్ బాబు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పూర్తిగా ఉడికించిన చికెన్ తినడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ అన్నారు. బర్డ్ ఫ్లూ కేసు నమోదైన ప్రాంతంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కోళ్ల ఫారాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, నిలిచిపోయిన కోళ్ల ఫారాలు మళ్లీరిగి ప్రారంభించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో వృద్ధి సాధించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నామని, చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. పాడి రంగంలో ఉన్న స్వయం ఉపాధి సంఘాల మహిళలకు అదనపు పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
Palnadu district
Bird flu reported
కలెక్టర్ అరుణ్ బాబు
బర్డ్ ఫ్లూ
కోళ్ల ఫారాలు
Scroll for the next article