News25th Jan 02:58 PMSunil Byrisetty1 min read
బంగారం దుకాణాలపై BIS దాడులు
బంగారం దుకాణాలవారికి BIS అధికారులు షాకిచ్చారు. విజయవాడలోని ఆభరణాల షాపులపై BIS అధికారులు దాడులు చేశారు. హాల్ మార్కింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్న షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించార
బంగారం దుకాణాలవారికి BIS అధికారులు షాకిచ్చారు.
విజయవాడలోని ఆభరణాల షాపులపై BIS అధికారులు దాడులు చేశారు. హాల్ మార్కింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్న షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నకిలీ హాల్ మార్కింగ్తో బంగారు ఆభరణాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. జైహింద్ కాంప్లెక్స్లో జ్యువెలరీ షాపుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు షాపులపై కేసులు నమోదు చేశారు.