News31st Jan 04:44 PMSunil Byrisetty1 min read

అమరావతిలో "బిట్స్ పిలానీ" క్యాంపస్

ప్రజారాజధాని అమరావతి ఉన్నత విద్యకు కేంద్రంగా రూపుదిద్దుకునే క్రమంలో కీలకమైన ముందడుగు పడింది. ప్రముఖ యూనివర్సిటీ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (BITS) అమరావతిలో 7

అమరావతిలో "బిట్స్ పిలానీ" క్యాంపస్
ప్రజారాజధాని అమరావతి ఉన్నత విద్యకు కేంద్రంగా రూపుదిద్దుకునే క్రమంలో కీలకమైన ముందడుగు పడింది. ప్రముఖ యూనివర్సిటీ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (BITS) అమరావతిలో 70.011 ఎకరాలలో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. బిట్స్ సంస్థకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ మేరకు సీఆర్డీయేతో బిట్స్ సంస్థ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బిట్స్ అమరావతి క్యాంపస్‌ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. మొదటి దశలోనే సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో క్యాంపస్ పనులు ప్రారంభించనున్నామన్నారు. ఆధునిక మౌలిక వసతులతో కూడిన స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, ఆధునిక బోధన పద్ధతులు, పర్యావరణహిత నిర్మాణాలతో ఈ క్యాంపస్‌ను కొత్త తరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. 2027 నుంచి అమరావతి క్యాంపస్‌లో విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. దశలవారీగా పదివేల మంది విద్యార్థులు బిట్స్ క్యాంపస్‌లో విద్యను అభ్యసించేలా కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు.
Andhra Pradesh
Amaravati Development
BITS Pilani
Amaravati Campus
Higher Education Hub
BITS University
కృత్రిమ మేధ
పర్యావరణహిత నిర్మాణాలు
2027 అడ్మిషన్లు
Scroll for the next article