News5th Aug 09:58 AMSunil Byrisetty1 min read
గుంటూరులో బీజేపీ చాయ్ పే చర్చ
బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరులో చాయ్ పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఉందన్నారు. ప్రపంచంలో ఏ నేత ఆలోచించని వ
బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరులో చాయ్ పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఉందన్నారు. ప్రపంచంలో ఏ నేత ఆలోచించని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రిని ఆదర్శంగా తీసుకొని ఈ చాయ్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మోడీ ఆలోచనతో మోడీ కాలనీ తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఆ కాలనీలో సీసీ కెమెరాలు, చక్కటి పారిశుధ్యం, లైటింగ్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుంటూరులో జిన్నా టవర్స్ పేరును మార్చుతామని పేర్కొన్నారు.