News1st Aug 11:13 AMSunil Byrisetty1 min read
అన్నవరం ఘటనపై అలర్ట్
అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమపాఠశాల విద్యార్థులు అస్వస్థత గురైన సంఘటన తెలుసుకుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అం
అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమపాఠశాల విద్యార్థులు అస్వస్థత గురైన సంఘటన తెలుసుకుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. విద్యార్థులు కు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల కు సూచించారు. అస్వస్థతకు గురైన ఎనిమిది మంది విద్యార్థులకు అవసరమైన వైద్యం అందించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దేవస్థానం పరిధిలో అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలన్నారు.