News30th Aug 05:20 PMSunil Byrisetty1 min read
సంచార జాతుల్లో స్పూర్తి నింపిన బిజెపి
మన ధర్మం ఇంకా ఉందంటే.. అందుకు సంచారజాతుల వారే ప్రధాన వారధులు.. వీరంతా సంస్కృతికి వారసులని బీజేపీ ఎపీ అధ్యక్షులు మాధవ్ అన్నారు. సంచార జాతులు శతాబ్దాల తరబడి మన సాంప్రదాయం రక్షిస్తున్
మన ధర్మం ఇంకా ఉందంటే.. అందుకు సంచారజాతుల వారే ప్రధాన వారధులు.. వీరంతా సంస్కృతికి వారసులని బీజేపీ ఎపీ అధ్యక్షులు మాధవ్ అన్నారు. సంచార జాతులు శతాబ్దాల తరబడి మన సాంప్రదాయం రక్షిస్తున్నారని చెప్పారు. నేటికి సంస్కృతిని విడనాడకుండా, వివక్షతను పట్టించుకోకుండా సంచార జాతుల వారు చేస్తున్న సేవలు చాలా గొప్ప అని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు నేడు చాలా మంది దూరంగా బతుకుతున్నామని తెలిపారు. సంచార జాతుల వారు ప్రకృతితో మమేకమై, ప్రకృతిని ఆరాధిస్తున్న గొప్ప జాతులని వివరించారు. సంచార జాతుల వైభవం, గొప్పతనాన్ని పునప్రతిష్ట చేసేందుకే స్పూర్తి అని పెట్టామన్నారు. లక్ష్మణ్ పార్లమెంటు లో మాట్లాడినందుకే.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నాయని మాధవ్ పేర్కొన్నారు.