News6th Aug 10:58 AMSunil Byrisetty1 min read
ప్రధాని మోడీ కృషి అందరికీ ఆదర్శం
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ బాపట్లలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి, క్రమశిక్షణ అందరికీ ఆదర్శమన్నారు. ఈరోజు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటే ఆయన క
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ బాపట్లలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి, క్రమశిక్షణ అందరికీ ఆదర్శమన్నారు. ఈరోజు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటే ఆయన కృషి పట్టుదల ఎంతో ఉందని పేర్కొన్నారు. చాయ్ అంగళ్లు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆయన నిర్వహించిన చాయిపే చర్చ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని అందుకు అనుగుణంగా సుపరిపాలనను అందిస్తున్నారని వివరించారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించుకోవాలి అంటే ఒక వేదిక కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ చాయ్ అంగళ్ళ వద్ద అనేక అంశాలు బయటికి వస్తాయన్నారు. బిజెపి అధ్యక్షులు మాధవ్ నిర్వహించిన చాయ్ పై చర్చ కార్యక్రమానికి బాపట్ల నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాధారణ ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించారు.