Politics4th Oct 11:24 AMSunil Byrisetty1 min read

స్థానికంలో బీజేపీ పాగా!

స్థానిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు రాబట్టే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఉండేలా టార్గెట్ నిర్దేశించుకుంది. పార్టీ బలోపేతానికి స

స్థానికంలో బీజేపీ పాగా!
స్థానిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు రాబట్టే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఉండేలా టార్గెట్ నిర్దేశించుకుంది. పార్టీ బలోపేతానికి స్థానిక ఎన్నికలే ముఖ్యమనే ఆలోచన చేసింది. ఏపీకి కేంద్ర సహకారాన్ని ప్రస్తావిస్తూ సీట్లు అడగాలని బీజేపీ భావిస్తోంది. గౌరవం తగ్గకుండా సీట్లు తీసుకుంటామని ఇప్పటికే పవన్ ప్రకటన చేసిన నేపథ్యంలో తమకు కూడా గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని కమలం పార్టీ కోరుతోంది. విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ, విశాఖ అడగడానికి చాలా కారణాలు ఉన్నాయంటోంది. సీట్ల సర్దుబాటుపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Scroll for the next article