Politics12th Apr 09:20 AMSunil Byrisetty1 min read

15లోపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ప్రకటన?

ఈ నెల 15లోపు రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే దాదాపు రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షు

15లోపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ప్రకటన?
ఈ నెల 15లోపు రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే దాదాపు రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్, తెలంగాణ బాధ్యతలు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌లకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని రేసులో దక్షిణ భారతదేశం నుంచి వనతి శ్రీనివాసన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, అన్నామలైలు ఉన్నారు. ఉత్తర భారత దేశం నుంచి వినోద్ తాడే, సునీల్ బన్సల్, దుష్యంత్ గౌతమ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపెందర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి
BJP
Telugu States
Politics
తెలుగు రాష్ట్రాల బీజేపీ
మాజీ ఎమ్మెల్సీ మాధవ్
Scroll for the next article