Politics29th Jul 01:39 PMSunil Byrisetty1 min read

స్థానిక సమరానికి కమలం సన్నద్ధం!

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ఏపీ బీజేపీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. నాలుగు జోన్లు.. ఒకే వ్యూహం.. స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఎన్నికల వ్యూహానికి నాలుగు జోన్ల ప్రత్యేక

స్థానిక సమరానికి కమలం సన్నద్ధం!
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ఏపీ బీజేపీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. నాలుగు జోన్లు.. ఒకే వ్యూహం.. స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఎన్నికల వ్యూహానికి నాలుగు జోన్ల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణ, సమన్వయం, వ్యూహరచన కోసం రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే నాలుగు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ, సంస్థాగత సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులతో నిరంతర సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ప్రత్యేక కమిటీలో సభ్యులుగా మంత్రి సత్యకుమార్, బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎమ్మెల్యే ఈశ్వర్‌రావు, ఉపాధ్యక్షులు అడారి ఆనంద్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి, నేతలు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఉంటారు.
Andhra Pradesh BJP
PVN Madhav
Local Body Elections
Andhra Pradesh Politics
Election Strategy
Four Zone Committee
సోము వీర్రాజు
నాగోతు రమేష్ నాయుడు
ఆదినారాయణ రెడ్డి
ఈశ్వర్‌రావు
Scroll for the next article